Hyderabad: 'ష్‌..! అరవకు'.. అన్నందుకు ప్రాణం తీశాడు

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నేరేడ్‌మెట్‌లో డిసెంబరు 2వ తేదీ సోమవారం నాడు ఒక చిన్న విషయమై జరిగిన వాగ్వాదంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.

By అంజి  Published on  3 Dec 2024 12:26 PM IST
murder, Hyderabad, Neredmet, argument, Crime

Hyderabad: 'ష్‌..! అరవకు'.. అన్నందుకు ప్రాణం తీశాడు

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నేరేడ్‌మెట్‌లో డిసెంబరు 2వ తేదీ సోమవారం నాడు ఒక చిన్న విషయమై జరిగిన వాగ్వాదంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. తాగిన మైకంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు పాల్పడ్డాడు. మృతుడు 37 ఏళ్ల బి రాము అనే సెంట్రింగ్ కార్మికుడిగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాము మద్యం దుకాణం పక్కనే ఉన్న పాన్ షాపు వద్దకు వచ్చాడు. అదే సమయంలో నిందితుడు శ్రీకాంత్ కూడా పాన్ షాప్ వద్దకు వచ్చి పాన్ కావాలని అడిగాడు. అయితే శ్రీకాంత్‌ నెమ్మదిగా పాన్‌ ఇవ్వమని కాకుండా.. తొందరగా పాన్‌ ఇవ్వాలని దుకాణాదారుడిపై గట్టిగా అరిచాడు.

దీనికెందుకు అలా అరుస్తున్నావని పక్కనే ఉన్న రాము (38) అడిగాడు. దీంతో రాము, శ్రీకాంత్‌ల మధ్య వాగ్వాదం జరగడంతో మృతుడు శ్రీకాంత్‌ను గొంతు ఎత్తవద్దని కోరాడు. ఆ అభ్యర్థనతో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ రాము ముఖంతో పాటు ఇతర శరీర భాగాలపై కొట్టాడు. ఈ ఘటనలో రాములుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నేరేడ్‌మెట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శ్రీకాంత్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మృతుడికి భార్య, ఆరేళ్ల కొడుకు ఉన్నారు.

Next Story