యూనివర్సిటీలో మనిషి ప్రాణం తీసిన కుక్కలు.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు

Man mauled to death by stray dogs in Aligarh Muslim University campus. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) ప్రాంగణంలో వీధికుక్కల గుంపు ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

By M.S.R  Published on  16 April 2023 6:19 PM IST
యూనివర్సిటీలో మనిషి ప్రాణం తీసిన కుక్కలు.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) ప్రాంగణంలో వీధికుక్కల గుంపు ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. శుక్రవారం ఏప్రిల్ 16న ఈ ఘటన జరగగా, బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దారుణ ఘటన రికార్డైంది.

వీడియోలో అనేక కుక్కలు బాధితుడిని చుట్టుముట్టాయి. అతనిని ఒకదాని తర్వాత మరొకటి కొరకడం మొదలుపెట్టడంతో.. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వైద్య సహాయం కోసం బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. రక్తం ఎక్కువగా పోవడంతో మార్గమధ్యంలోనే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


Next Story