భార్యను చంపి.. మృతదేహాన్ని బెడ్‌బాక్స్‌లో దాచిన భర్త

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి ఇంట్లో గొడవల కారణంగా భార్యను చంపి, ఆమె మృతదేహాన్ని

By అంజి  Published on  15 May 2023 7:00 AM IST
Man kills wife, Madhya Pradesh, Crime news

భార్యను చంపి.. మృతదేహాన్ని బెడ్‌బాక్స్‌లో దాచిన భర్త

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి ఇంట్లో గొడవల కారణంగా భార్యను చంపి, ఆమె మృతదేహాన్ని 24 గంటల పాటు బెడ్‌బాక్స్‌లో దాచిపెట్టాడు. గురువారం మృతదేహాన్ని వెలికితీశారు. నిందితుడు వినయ్ పర్మార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 1996లో దీపా బాయిని పెళ్లాడిన వినయ్ పర్మార్ ఆమెతో కలిసి జీవించడం ఇష్టంలేక విడాకులు కోరుతున్నట్లు దీపా సోదరుడు హేమంత్ తెలిపారు. కొన్ని గృహ వివాదాల కారణంగా దీపా.. వినయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నిందితుడు దీపతో ఉన్న వివాదాన్ని పరిష్కరించి, తన ఇంటికి తిరిగి రావాలని ఆమెను ఒప్పించాడు. వినయ్‌ ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు.

ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తనని కప్పిపుచ్చుకోవడానికి దీపా కనిపించకుండా పోయిందని వినయ్ తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. దాదాపు 24 గంటల పాటు వెతికినా దీప గురించి ఎలాంటి సమాచారం లేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఉన్న వినయ్ దీపను హత్య చేసి శవాన్ని బెడ్‌బాక్స్‌లో దాచినట్లు తన తల్లికి చెప్పాడని అమర్ ఉజ్జల తెలిపింది. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

దీప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులు కనిపించాయి. ముఖ్యంగా బెడ్‌బాక్స్‌పై ఉంచిన పరుపు సగం కాలిపోయిందని సమాచారం. దీంతో పోలీసులు విజయ్‌పై హత్య కేసు నమోదు చేశారు. దీపా, వినయ్‌లకు 21 ఏళ్ల కుమార్తె, 17 ఏళ్ల కుమారుడు ఉన్నారు. తన భర్త వినయ్‌తో సహా అత్తమామలు తన సోదరిని హత్య చేశారని దీప సోదరుడు హేమంత్ ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story