ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తోందని.. భార్యను కిరాతకంగా చంపిన భర్త

Man kills wife for spending too much time making social media reels in Tamilnadu. తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 38 ఏళ్ల వ్యక్తి ఆదివారం రాత్రి తన భార్యను ఆమె చీర

By అంజి  Published on  8 Nov 2022 3:08 PM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తోందని.. భార్యను కిరాతకంగా చంపిన భర్త

తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 38 ఏళ్ల వ్యక్తి ఆదివారం రాత్రి తన భార్యను ఆమె చీర కొంగుతో గొంతు నులిమి హత్య చేశాడు. భార్య సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్ చేస్తూ ఎక్కువ సమయం గడపడంపై భర్త చాలా కోపంగా ఉన్నాడు. తిరుప్పూర్ జిల్లాలో ఈ ఘటన జరగ్గా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దిండుగల్‌కు చెందిన 38 ఏళ్ల అమృతలింగం చిత్రను వివాహం చేసుకుని తిరుపూరులోని సెల్లం నగర్‌లో నివసిస్తున్నాడు. తెన్నం పాళయం కూరగాయల మార్కెట్‌లో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.

అతని భార్య చిత్ర ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేసే అలవాటు ఉంది. అమృతలింగం రీల్స్ పోస్ట్ చేసే అలవాటుపై చిత్రతో చాలాసార్లు గొడవ పడ్డాడు. ఆమె వాటి కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తుండటంపై ఆగ్రహంతో ఉన్నాడు. ఎక్కువ మంది ఫాలోవర్లు, పరిచయాలను సంపాదించిన తరువాత.. భార్య చిత్రా నటనలో వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకుంది. రెండు నెలల క్రితమే ఆమె చెన్నై వెళ్లిపోయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 33.3K మంది ఫాలోవర్లు ఉన్నారు.

గత వారం ఆమె తన కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు తిరిగి వచ్చింది. కార్యక్రమం ముగిసిన తరువాత, ఆమె చెన్నైకి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది, కానీ అమృతలింగం ఆమెను వెళ్లడానికి ఇష్టపడలేదు. రీళ్లు అప్‌లోడ్ చేయడం, సినిమాల్లో నటించాలనే కోరికపై చిత్రకు ఆమె భర్త అమృతలింగానికి ఆదివారం రాత్రి వాగ్వాదం జరిగింది. ఘర్షణ విధ్వంసానికి దారితీసింది. అమృతలింగం ఆమె చీర కొంగుతో గొంతు కోశాడు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో అమృతలింగం భయాందోళనకు గురై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చిత్రను కొట్టినట్లు కూతురికి తెలియజేశాడు.

తల్లిని చూసేందుకు కూతురు ఇంటికి వెళ్లగా, చిత్ర శవమై కనిపించింది. ఆమె పోలీసు అధికారులకు సమాచారం అందించింది, వారు చిత్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెరుమానల్లూర్‌లో అమృతలింగాన్ని అరెస్టు చేశారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.

Next Story