మరో దారుణం.. ప్రియురాలిని చంపి బెడ్‌బాక్స్‌లో దాచిన ప్రియుడు

Man kills live-in partner, hides body in bed box in Maharashtra. ఢిల్లీలోని నజఫ్‌గఢ్ కేసులో ఘాతుకమైన వివరాలు వెలువడుతున్న సమయంలో..

By అంజి  Published on  16 Feb 2023 1:45 AM GMT
మరో దారుణం.. ప్రియురాలిని చంపి బెడ్‌బాక్స్‌లో దాచిన ప్రియుడు

ఢిల్లీలోని నజఫ్‌గఢ్ కేసులో ఘాతుకమైన వివరాలు వెలువడుతున్న సమయంలో.. మహారాష్ట్రలో ఇలాంటి దారుణ సంఘటనే ఒకటి బయటపడింది. ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని బెడ్ బాక్స్‌లో దాచాడు. నలసోపరాలోని వారి నివాసంలో తన 35 ఏళ్ల లైవ్-ఇన్ పార్టనర్‌ని హత్య చేసినందుకు 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పాల్ఘర్ జిల్లాలోని తులింజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు హార్దిక్ షా, మేఘ ధన్ సింగ్ తోర్వితో కలిసి నలసోపరాలోని సీతా సదన్ సొసైటీలో ఉంటున్నాడు. తమ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌, యజమాని, ఇరుగుపొరుగు వారికి వివాహమైందని జంట చెప్పినట్లు సమాచారం.

నలసోపరాలోని విజయ్ నగర్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్ నుంచి కుళ్లిపోయిన మేఘా మృతదేహాన్ని వెలికితీయడంతో హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి అద్దె ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె గత వారంలో హత్యకు గురై ఉంటుందని అనుమానిస్తున్నట్లు సీనియర్ ఇన్‌స్పెక్టర్ శైలేంద్ర నాగర్కర్ తెలిపారు. మేఘాను హత్య చేసి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న లైవ్ ఇన్ పార్టనర్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

నిందితుడికి ఉద్యోగం లేదని.. దీంతో మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అలాంటి ఒక గొడవ సమయంలో అతను ఆమెను చంపాడని ఆ అధికారి తెలిపారు. మేఘా ఎప్పుడు హత్యకు గురైందో కచ్చితమైన తేదీని నిర్ధారించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడు తన ప్రియురాలిని హత్య గురించి మెసేజ్ చేసి పారిపోయే ముందు ఫ్లాట్‌లోని ఫర్నిచర్‌ను విక్రయించాడు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఒక అధికారి తెలిపారు.

ఢిల్లీ నజాఫ్‌గఢ్ హత్య

ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో 22 ఏళ్ల నిక్కీ యాదవ్ హత్య దేశాన్ని కుదిపేసిన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నజఫ్‌గఢ్‌లోని మిత్రోన్ గ్రామ శివార్లలోని ధాబాలో తన 22 ఏళ్ల లైవ్-ఇన్ భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచినందుకు ఢిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మృతురాలు, నిక్కీ యాదవ్‌గా గుర్తించబడింది, ఫిబ్రవరి 9 మరియు 10 మధ్య రాత్రి కాశ్మీరీ గేట్ ఐఎస్‌బీటీ సమీపంలో ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ (24) గొంతు కోసి చంపాడు. నిందితుడు తన మొబైల్ డేటా కేబుల్‌ను ఉపయోగించాడని ఆరోపించారు. తన కారులో మహిళను గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత అదే రోజు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.

గత ఏడాది మేలో కోపంతో శ్రద్దా వాకర్‌ని గొంతు కోసి హత్య చేసిన ఆఫ్తాబ్ పూనావాలా కథకు సాహిల్ కథకు దగ్గరి పోలికలు ఉన్నాయి. పూనావాలా వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి 300-లీటర్ల రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి మెహ్రౌలీలోని ఒక అడవిలో శరీర భాగాలను పారవేసాడు.

Next Story