మహిళ కోసం మనస్పర్థలు.. తోటి ఫ్రెండ్‌ని చంపేశాడు

ఆదివారం వాయువ్య ఢిల్లీలోని తన అద్దె ఇంట్లో 33 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన సాయంత్రం 4.30 గంటలకు మహీంద్రా పార్క్‌లో జరిగింది.

By అంజి  Published on  29 April 2024 7:00 PM IST
Man kills friend, Delhi, Crime

మహిళ కోసం మనస్పర్థలు.. తోటి ఫ్రెండ్‌ని చంపేశాడు

ఆదివారం వాయువ్య ఢిల్లీలోని తన అద్దె ఇంట్లో 33 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన సాయంత్రం 4.30 గంటలకు మహీంద్రా పార్క్‌లో జరిగింది. ఆ తర్వాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. బాధితుడిని వృత్తిరీత్యా పేపర్‌ కటింగ్‌ మెకానిక్‌ జాహిద్‌గా గుర్తించగా, నిందితుడిని రవిగా గుర్తించారు. వార్తా సంస్థ పిటిఐ ప్రకారం.. ఇద్దరు ఒక మహిళ కోసం గొడవ పడ్డారని తెలిసింది. ఈ ఘటనపై వ్యాఖ్యానించిన పోలీసులు.. జాహిద్, రవితో మహిళకు పరిచయం ఉందని, కత్తిపోట్లు జరిగినప్పుడు ఇంట్లో ఆ మహిళ కూడా ఉందని చెప్పారు.

జాహిద్‌తో కలిసి ఉన్న మహిళను అతని ఇంట్లో చూసిన తర్వాత జాహిద్, రవి మధ్య మాటల వాగ్వాదం జరిగింది. వాగ్వాదం పెరగడంతో, రవి జాహిద్‌ను కత్తితో పొడిచాడు, అతను మరణించాడు, ఒక పోలీసు అధికారి చెప్పినట్లు తెలిసింది. గొడవలో రవికి కూడా కొన్ని గాయాఆలు అయ్యాయి. తన స్నేహితుడిని కత్తితో పొడిచిన తర్వాత రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. "రవి స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సంఘటన గురించి తెలియజేశాడు. రవి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు" అని అధికారి తెలిపారు. కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.

Next Story