Hyderabad: ఆస్తి కోసం.. తండ్రిని, మామను చంపిన వ్యక్తి
హైదరాబాద్ నగరంలో దారణ ఘటన చోటు చేసుకుంది. శనివారం నాడు మైలార్‌దేవ్‌పల్లిలోని బాబుల్‌రెడ్డి కాలనీలో ఓ వ్యక్తి రాడ్‌తో తన తండ్రి, మామను హతమార్చాడు.
By అంజి Published on 28 Jan 2024 9:30 AM ISTHyderabad: ఆస్తి కోసం.. తండ్రిని, మామను చంపిన వ్యక్తి
హైదరాబాద్ నగరంలో దారణ ఘటన చోటు చేసుకుంది. శనివారం నాడు మైలార్‌దేవ్‌పల్లిలోని బాబుల్‌రెడ్డి కాలనీలో ఓ వ్యక్తి రాడ్‌తో తన తండ్రి, మామను హతమార్చాడు. ఈ జంట హత్యలకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు తెలిపారు. లక్ష్మీనారాయణ (55), అతని బావ శ్రీనివాసులుపై దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు రాకేష్‌ను పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం తన తండ్రితో సహా ఇద్దరిని హత్య చేసిన ఆరోపణలపై 27 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.
రాజేంద్రనగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బి గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రాకేష్ జీవనోపాధి కోసం కూలీ పనులు చేసేవాడు. అతను తన తండ్రి నారాయణతో సహా తన కుటుంబంతో ఉన్నాడు. పోలీసుల విచారణలో లక్ష్మీనారాయణ కుటుంబం తమ ఇంటిని 53 లక్షలకు విక్రయించాలని నిర్ణయించుకుని 15 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. “లక్ష్మీనారాయణ ప్రతి సమస్యలోనూ తన సోదరి కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేస్తాడని రాకేష్, అతని తల్లి, అతని తోబుట్టువులు ఎప్పుడూ బాధపడేవారు. రాకేష్‌తో సహా అతని భార్య, పిల్లలు.. ఆస్తి విషయంలో వివాదం చేశారు" అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రాజేంద్రనగర్) గంగాధర్ తెలిపారు.
ఈ విషయమై లక్ష్మీనారాయణ, భార్య మధ్య వాగ్వాదం జరగడంతో ఆమెను కొట్టాడు. దీంతో రాకేష్ తన తండ్రితో గొడవ పడ్డాడు. నిందితులు రాడ్ తీసుకుని అందరి ముందే లక్ష్మీనారాయణపై దాడికి దిగారు. శ్రీనివాసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కూడా అదే రాడ్‌తో దాడి చేశారు. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వృద్ధులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.