దారుణం.. అసహజ శృంగారానికి నిరాకరించాడని బాలుడిని చంపిన వ్యక్తి

నవీ ముంబైలోని చెరువులో 12 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తాపీ మేస్త్రీలుగా పనిచేస్తున్న ఇద్దరు సోదరులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

By అంజి  Published on  31 March 2024 11:25 AM IST
Man kills boy, Navi Mumbai, arrest, Crime news

దారుణం.. అసహజ శృంగారానికి నిరాకరించాడని బాలుడిని చంపిన వ్యక్తి 

నవీ ముంబైలోని చెరువులో 12 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తాపీ మేస్త్రీలుగా పనిచేస్తున్న ఇద్దరు సోదరులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఇద్దరిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా నిందితులలో ఒకరు.. ఠాకూర్‌పాడ ప్రాంతానికి చెందిన బాలుడిని కిడ్నాప్ చేసి, అతనిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అతన్ని చంపాడు. అతని సోదరుడు మృతదేహాన్ని పారవేసేందుకు సహాయం చేసాడని పోలీసులు తెలిపారు. నవీ ముంబైలోని తలోజా సమీపంలోని గ్రామంలోని చెరువులో బాలుడి మృతదేహం లభ్యమైంది. మార్చి 25న ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు కనిపించకుండా పోయాడని, దీనిపై షిల్-దైఘర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

"నవీ ముంబైలోని తలోజా సమీపంలోని చెరువులో చేతులు కట్టివేయబడి, తలపై గాయంతో ఉన్న బాలుడి మృతదేహం కనుగొనబడింది" అని ఒక ప్రకటన తెలిపింది. రంజాన్ మహ్మద్ కుద్దూస్ షేక్ (20), అతని సోదరుడు ఆజాద్ మహ్మద్ కుద్దుస్ షేక్ (30) నేరానికి సంబంధించి సాంకేతిక, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. "సోదరులలో ఒకరైన రంజాన్, బాలుడితో అసహజ సంభోగానికి ప్రయత్నించాడు, కానీ అతను ప్రతిఘటించాడు. బాలుడు గట్టిగా కేకలు వేశాడు. దీంతో నిందితుడు బాలుడి తలని రాయితో పగులగొట్టాడు. గుడ్డ ముక్కతో అతనిని గొంతుకోసి చంపాడు. నిందితుడి సోదరుడు అతనికి మృతదేహానికి పారవేయడంలో సహాయం చేశాడు. మృతదేహం చెరువులో ఉంది’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story