3000 రూపాయల కోసం గొడవ.. చివరికి ఏమైందంటే..?

Man killed over Rs 3,000 in Gurgaon. బిలాస్‌పూర్‌లోని ఘోష్‌గఢ్ గ్రామంలో 3,000 రూపాయల విషయంలో మొదలైన వివాదం కారణంగా

By M.S.R  Published on  27 Jan 2023 3:45 PM GMT
3000 రూపాయల కోసం గొడవ.. చివరికి ఏమైందంటే..?

బిలాస్‌పూర్‌లోని ఘోష్‌గఢ్ గ్రామంలో 3,000 రూపాయల విషయంలో మొదలైన వివాదం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గొడవ కారణంగా మంగళవారం నాడు 33 ఏళ్ల వ్యక్తిని నలుగురు వ్యక్తులు కర్రలతో కొట్టారని పోలీసులు తెలిపారు. బాధితుడు బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. బాధితుడు దళిత వర్గానికి చెందిన వ్యక్తి. మృతుడు కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఇందర్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న నలుగురు నిందితులు సాగర్ యాదవ్, ఆజాద్ యాదవ్, ముఖేష్ యాదవ్, హితేష్ యాదవ్ అని పోలీసులు తెలిపారు.

బాధితుడి తండ్రి మాట్లాడుతూ ప్రధాన నిందితుడు సాగర్ తన కుమారుడి స్నేహితుడని, కరెంటు బిల్లు చెల్లించేందుకు రూ.19,000 ఇచ్చాడని తెలిపాడు. అయితే నా కొడుకు రూ.3,000 వేరే అవసరాలు ఉంటే ఖర్చు చేశాడు. మంగళవారం సాయంత్రం, అతను నా కొడుకును పిలిచాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో నా కొడుకు ఫోన్ నుండి నాకు కాల్ వచ్చింది. నిందితుడు మాట్లాడుతూ మరుసటి రోజులోగా నీ కొడుకు డబ్బులు మొత్తం తిరిగి చెల్లించకపోతే నువ్వే డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. నా కొడుకు ఇవ్వకపోతే నేను చెల్లిస్తానని చెప్పానని అన్నారు. నా కొడుకు ఫోన్‌ని వాళ్ల దగ్గరే ఉంచుకున్నాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఒక గంట తర్వాత కొందరు స్నేహితులు నా కొడుకును మా ఇంటి వద్ద దింపారు. నా కుమారుడు విపరీతమైన నొప్పితో విలవిలలాడుతూ ఉన్నాడు.. సరిగ్గా నడవలేకపోయాడు. నిందితుడూ అతని ముగ్గురు సహాయకులు కర్రలతో కొట్టారని చెప్పాడని బాధితుడు తండ్రి వాపోయాడు. బాధితుడి కుటుంబ సభ్యులు అతన్ని పటౌడీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడి నుంచి గుర్గావ్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు మద్యం మత్తులో బాధితుడిని కర్రలతో కొట్టారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, వారిలో ఒకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.


Next Story