కూతురికి త‌న పోలిక‌లు రాలేద‌ని.. దారుణానికి పాల్ప‌డిన వ్య‌క్తి

Man killed his wife and Daughter in Guravarajupalle.కుమార్తెకు త‌న పోలిక‌లు రాలేద‌ని క‌ట్టుకున్న భార్య‌ను, కూతురిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sept 2022 9:06 AM IST
కూతురికి త‌న పోలిక‌లు రాలేద‌ని.. దారుణానికి పాల్ప‌డిన వ్య‌క్తి

అనుమానం.. ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. ఒక్క‌సారి అనుమానం మొద‌లైందంటే జీవితంలో అది పోద‌ని అంటుంటారు. కుమార్తెకు త‌న పోలిక‌లు రాలేద‌ని క‌ట్టుకున్న భార్య‌ను, కూతురిని దారుణంగా హ‌త మార్చిన ఘ‌ట‌న తిరుప‌తి స‌మీపంలోని గురువ‌రాజుప‌ల్లిలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. గురువ‌రాజుప‌ల్లె ఎస్టీ కాల‌నీకి చెందిన కుమార్‌, పావ‌ని లు రెండు సంవ‌త్స‌రాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. సంవ‌త్స‌రం క్రితం కుమార్తె పుట్టింది. కూతురికి అమృత అని పేరు పెట్టుకున్నారు. అయితే.. పాప పుట్టిన ద‌గ్గ‌ర నుంచి కుమార్ నిత్యం పావ‌ని ని వేధించేవాడు. కూతురికి త‌న పోలిక‌లు రాలేద‌ని భార్య‌ను అనుమానించేవాడు. ఈ క్ర‌మంలో దారుణానికి ఒడిగ‌ట్టాడు.

గత ఆదివారం చేపలు పట్టుకుందామంటూ పావ‌ని, అమృత‌ను ఎయిర్‌పోర్టు సమీపంలోని ఇసుక కాలువ దగ్గరకు తీసుకువెళ్లాడు. అక్క‌డ పావ‌ని క‌ర్ర‌తో కొట్టి, ఇద్ద‌రిని కాలువ‌లో తోసేశాడు. అయితే.. మూడు రోజుల నుంచి పావ‌ని, అమృత క‌నిపించ‌క‌పోవ‌డంతో బంధువులు రేణిగుంట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు కుమార్‌ను అదుపులోకి తీసుకుని త‌మ‌దైన శైలిలో విచారించ‌గా అస‌లు విష‌యం చెప్పాడు. ఘ‌ట‌నాస్థ‌లానికి వెళ్లిన పోలీసులు కాలువ‌లో గాలింపు చేప‌ట్టి.. పావ‌ని మృత‌దేహాన్ని వెలికి తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. పాప మృత‌దేహం దొర‌క‌లేదు. ఒకేసారి త‌ల్లి, కుమార్తెలు మృతి చెంద‌డంతో ఆ గ్రామంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

Next Story