గొడవకు దిగారన్న కక్షతో.. బెంజ్‌ కారుతో ఢీ.. మహిళ మృతి

Man intentionally rams his car into bike, woman died. కారు రోడ్డుపై వెళ్తుండగా.. పక్క నుంచి వెళ్తున్న బైక్‌పై బురద నీరు చిమ్మడంతో భార్యాభర్తలు ప్రశ్నించారు.

By అంజి
Published on : 22 Dec 2022 3:40 PM IST

గొడవకు దిగారన్న కక్షతో.. బెంజ్‌ కారుతో ఢీ.. మహిళ మృతి

కారు రోడ్డుపై వెళ్తుండగా.. పక్క నుంచి వెళ్తున్న బైక్‌పై బురద నీరు చిమ్మడంతో భార్యాభర్తలు ప్రశ్నించారు. దీంతో కారు నడుపుతున్న వ్యక్తి.. దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో నగరంలో చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ఏఐజీ సమీపంలో డిసెంబరు 18వ తేదీన ఈ ఘటన జరిగింది. మృతురాలు ఎర్రగడ్డకు చెందిన మరియా మీర్ (25) తన భర్తతో కలిసి డిసెంబర్ 18న ఏఐజీ వద్దకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఆమె బంధువులు కూడా మరో బైక్‌పై వారిని అనుసరిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి రాజసింహారెడ్డి (26) బెంజ్ కారులో ప్రయాణిస్తుండగా, మరియా బంధువులు ప్రయాణిస్తున్న బైక్‌పై నీళ్లు చీమ్మినట్లు చెబుతున్నారు. దీంతో వారు కారును వెంబడించి ప్రశ్నించగా వారి బైక్‌ను అతడు కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనను చూసిన మారియా భర్త కారును వెంబడించి ఘటనపై అతడిని ప్రశ్నించగా అతి వేగంతో వారిని కూడా కొట్టారు. ఈ ఘటనలో మరియాకు తీవ్రగాయాలు కాగా, ఏఐజీలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమెకు 8 నెలల పాప ఉంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story