దారుణం.. హైదరాబాద్‌లో పట్టపగలు వ్యక్తిని నరికి చంపారు

Man hacked to death in broad daylight in Hyderabad. జనవరి 22 ఆదివారం హైదరాబాద్‌లో పట్టపగలు ఓ వ్యక్తిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు

By అంజి
Published on : 23 Jan 2023 10:00 AM IST

దారుణం.. హైదరాబాద్‌లో పట్టపగలు వ్యక్తిని నరికి చంపారు

జనవరి 22 ఆదివారం హైదరాబాద్‌లో పట్టపగలు ఓ వ్యక్తిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్ సమీపంలోని జియాగూడ బైపాస్ రోడ్డులో కొడవళ్లు, రాడ్లతో వచ్చిన దుండగులు బాధితుడిని వెంబడించి దాడి చేశారు. ఈ దారుణ హత్యను కొందరు బాటసారులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో బాధితుడు నేలపై పడి ఉన్నాడు.

ఈ హత్య ఆ ప్రాంతంలో భయాందోళనకు గురి చేసింది. కొందరు భయంతో పరుగులు తీయగా, రోడ్డుకు అవతలివైపు ఉన్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. బాధితుడిని హత్య చేసిన అనంతరం దుండగులు పక్కనే ఉన్న మూసీ నదిలో దూకి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధార్ కార్డు ఆధారంగా బాధితుడిని కోటిలోని ఇసామియా బజార్‌లో నివాసముంటున్న జంగం సాయినాథ్ (32)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

రౌడీ షీటర్ల మధ్య గొడవలే హత్యకు దారితీసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయినాథ్‌ని నరికి చంపిన దుండగులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Next Story