కరెంట్‌ షాక్‌ ఇచ్చి.. భార్యను చంపిన భర్త.. ఆపై గదిలోనే మృతదేహాన్ని పాతిపెట్టి

Man electrocutes wife to death, buries body in room in Uttarpradesh. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. లఖీంపూర్‌లోని గోలా గోకరన్ ప్రాంతంలో

By అంజి
Published on : 25 Dec 2022 3:42 PM IST

కరెంట్‌ షాక్‌ ఇచ్చి.. భార్యను చంపిన భర్త.. ఆపై గదిలోనే మృతదేహాన్ని పాతిపెట్టి

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. లఖీంపూర్‌లోని గోలా గోకరన్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యను కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపాడు. ఆపై ఆమె మృతదేహాన్ని ఒక గదిలో పాతిపెట్టాడు. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు పట్టుబడకుండా ఉండేందుకు రెండు రోజుల పాటు.. ఆమెను పూడ్చి పెట్టిన గదిలోనే పడుకున్నాడు. హత్య జరిగినట్లు నిందితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహ్మద్ వాషి అనే నిందితుడు.. ఉషా శర్మ ఇస్లాం మతంలోకి మారి తన పేరును అక్సా ఫాతిమాగా మార్చుకున్న తర్వాత కొన్నేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిద్రపోయే ముందు మహ్మద్ వాషి తన భార్యతో గొడవ పడ్డాడు. ఆమె నిద్రపోయిన తర్వాత, అతను ఆమె చేతులు, కాళ్ళు కట్టివేసి, ఆపై ఆమెకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపాడు. నిందితుడు ఆమెను అదే గదిలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. ''పట్టుకోబడకుండా ఉండటానికి, అతను రెండు రోజుల పాటు ఒకే గదిలో పడుకున్నాడు. అయితే ఇంటికి వచ్చిన అతని తల్లి తన కోడలు లేకపోవడంతో ప్రశ్నించింది. ఆమె ఆచూకీ లభించకపోగా, పోలీసులకు సమాచారం అందించింది'' అని అధికారి తెలిపారు.

Next Story