తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంలోని తన నివాసంలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు

By Medi Samrat  Published on  16 Sept 2024 3:31 PM IST
తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంలోని తన నివాసంలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటికి వెళ్లిన కుమారుడు ఇంటికి ఆల‌స్యంగా వ‌చ్చాడ‌ని తండ్రి మంద‌లించ‌డంతో విద్యార్థి మనస్తాపం చెంది ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. మృతుడు 18 ఏళ్ల అశోక్ తన స్నేహితులతో కలిసి ఆదివారం స్థానిక సరస్సు వద్ద గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లాడు. అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని అశోక్ ముందుగా తల్లిదండ్రులకు తెలియజేయకపోవడంతో.. తండ్రి అతడిని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన అశోక్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం మేరకు సూరారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. భారతీయ న్యాయ్ సంహిత సెక్షన్ 194, 174 కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు.

Next Story