Medchal: కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌.. యువకుడు మృతి

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

By అంజి  Published on  23 Jan 2024 11:50 AM IST
Suraram, Medchal, Crime news, road accident

Medchal: కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌.. యువకుడు మృతి

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సూరారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కట్టమైసమ్మ దేవాలయం మలుపు దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3:00 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యువకుడు అతి వేగంగా బైక్‌ని నడుపుతూ కట్ట మైసమ్మ దేవస్థానం మలుపు దగ్గర, విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. దీంతో యువకుడు ఎగిరి రోడ్డు మీద పడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతుడు భాస్కర్ రెడ్డి అని, అతడు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన వాడని గుర్తించారు. అతడు నగరంలోని గండి మైసమ్మ ప్రాంతంలో ఓ హాస్టల్ లో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగంతో వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు అంటున్నారు. సూరారం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story