అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అమరాపురం మండలం పరిధిలోని కేంకరలో షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం అయింది. ఈ ఘటనలో గుడిసెలో నివసిస్తున్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు. చనిపోయిన వ్యక్తి గోవిందప్ప (60)గా గుర్తించారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే గోవిందప్ప ఇంట్లో.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. మంటలు లేచిన సమయంలో గోవిందప్ప నిద్రించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల విషాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.