పక్కింటి వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం.. పిల్లలతో కలిసి సెల్‌టవర్‌ ఎక్కిన భర్త

Man climbs on tower with kids over wife's infidelity in UP. కాన్పూర్ దేహత్‌లో ఓ వ్యక్తి.. స్థానిక వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధంపై కలత చెంది, తన పిల్లలతో కలిసి సెల్‌ టవర్‌పైకి ఎక్కి

By అంజి  Published on  25 Jan 2022 1:50 PM IST
పక్కింటి వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం.. పిల్లలతో కలిసి సెల్‌టవర్‌ ఎక్కిన భర్త

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్‌లో ఓ వ్యక్తి.. స్థానిక వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధంపై కలత చెంది, తన పిల్లలతో కలిసి సెల్‌ టవర్‌పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఒక గంటకు పైగా హై డ్రామా జరిగింది. తన పిల్లలను దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు తోసేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఘటన అక్బర్‌పూర్‌లోని గాంధీ నగర్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. చుట్టుపక్కల గందరగోళం నెలకొనడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు అరగంట సేపు నచ్చజెప్పిన పోలీసులు అతడిని, పిల్లలను కిందకు దించారు.

పొరుగువారితో భార్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఆ వ్యక్తి చెప్పినట్లుగా.. అతని భార్య, వారి ఇంటికి సమీపంలో నివసిస్తున్న ఒక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందని పోలీసులు తెలిపారు. "ఆ వ్యక్తి చెప్పినట్లుగా, అతను లేనప్పుడు, అతని పొరుగువాడు అతని ఇంటికి తరచుగా వస్తాడు. అతను తన పొరుగువారిని చాలాసార్లు మందలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది" అని పోలీసులు చెప్పారు. సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మరోవైపు ఫిర్యాదు ఆధారంగా.. అతని భార్యను ప్రలోభపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పొరుగువారిపై శాంతి విఘాతం కోసం చర్యలు తీసుకున్నట్లు అక్బర్‌పూర్ పోలీసులు తెలిపారు. సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని సర్కిల్ అధికారి (సిఓ) అక్బర్‌పూర్ అరుణ్ కుమార్ తెలిపారు. "ఏదైనా తగిన చర్య తీసుకోబడుతుంది" అని అధికారి తెలిపారు.

Next Story