Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య

హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తారిక్‌ అలీ అలియాస్‌ బాబా ఖాన్‌ (40)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

By అంజి  Published on  19 Dec 2023 10:08 AM IST
murder, Old City, Hyderabad, Crime news

Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య

హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. ఐఎస్‌ సదన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామచంద్రనగర్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తారిక్‌ అలీ అలియాస్‌ బాబా ఖాన్‌ (40)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట కూర్చున్న మహమ్మద్ సాదిక్ అలీ ఖాద్రి పై కత్తులతో దాడి చేసి విచక్షణ రహితంగా పలుచోట్ల కత్తులతో పొడిచారు. దీంతో మహమ్మద్ సాదిక్ అలీ ఖాద్రికి తీవ్ర రక్తస్రావమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.

విషయం తెలుసుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మనోహర్‌తో పాటు చాంద్రాయణగుట్ట ఏసీపీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలోకి దింపి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story