దారుణం : బంధువును హత్య చేసి.. స్నేహితులతో కలిసి తలతో సెల్ఫీలు
Man Beheads Cousin Over Land Dispute Friends Take Selfie With Head.నమామ కుమారుడిని స్నేహితులతో కలిసి నరికి హత్య
By తోట వంశీ కుమార్
ఇటీవల కాలంలో మనుషుల్లో ద్వేషం పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకే ఎదుటివారిపై పగ పెంచుకుని వారిని హతమారుస్తున్నారు. భూ వివాదం నేపథ్యంలో మేనమామ కుమారుడిని స్నేహితులతో కలిసి నరికి హత్య చేశాడో ఓ వ్యక్తి. తాము ఏదో ఘనకార్యం చేసినట్లు మొండెం నుంచి వేరు చేసిన తలతో సెల్ఫీలు దిగారు. ఈ ఘోర ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ఖుంటి జిల్లాలో చోటు చేసుకుంది.
55 ఏళ్ల దాసాయ్ ముండా ఈ నెల 1న కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. అతడి కుమారుడు కను ముండా(24) ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడు. సాయంత్రం పొలానికి వెళ్లిన వాళ్లు ఇంటికి చేరుకున్నారు. అయితే.. కను ముండ కనిపించలేదు. అతడి కోసం అంతా గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదులో తన మేనల్లుడు సాగర్ ముండా, అతడి స్నేహితులే తన కొడుకును కిడ్నాప్ చేసి ఉంటారని దాసాయ్ ముండా పేర్కొన్నారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులు కనుని దారుణంగా హతమార్చినట్లు తెలిసింది. మృతుడి తలను మొండెం నుంచి వేరు చేసి దానితో వారు సెల్ఫీలు దిగారు. మృతుడి మొండం గోస్లా అడవిలో, తల 15 కిలోమీటర్ల దూరంలోని దుల్వా తుంగీ ప్రాంతంలో కనుగొన్నాట్లు పోలీసులు తెలిపారు.
ఓ భూ విషయమై మృతుడి కుటుంబానికి, నిందితులకు మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయని, ఇవే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు, అతడి భార్యతో సహా ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు ఐదు సెల్‌ఫోన్లు, హత్యకు వినియోగించిన ఆయుధాలను, ఎస్‌యూవీ కారుని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.