ప్రేమోన్మాది ఘాతుకం.. యువ‌తిపై దాడి.. ఆపై

Man attack with knife on girl. జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ యువ‌తిపై క‌త్తితో దాడి చేసి.. అనంత‌రం అదే క‌త్తితో గొంతుకోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 4:25 AM GMT
man attack with knife

దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట వారిపై దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ యువ‌తిపై క‌త్తితో దాడి చేసి.. అనంత‌రం అదే క‌త్తితో గొంతుకోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వివ‌రాల్లోకి వెళితే.. జగిత్యాల మండలం జాబితా పూర్ గ్రామానికి చెందిన ఓ యువ‌తి(24)ని మేడిప‌ల్లి మండ‌లం మ‌న్నెగూడెం గ్రామానికి చెందిన క‌ట్కం రాజ్‌కుమార్ కొంత‌కాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంట‌ప‌డుతున్నాడు.

రాజ్‌కుమార్ ఉపాధి కోసం నాలుగు సంవ‌త్స‌రాల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఇటివ‌లే తిరిగి వ‌చ్చాడు. వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి యువ‌తికి ఫోన్ చేసే క‌ల‌వాల‌ని వేదించేవాడు. ఆమె స్పందించ‌క‌పోవ‌డంతో శ‌నివారం రాత్రి ఆ యువ‌తి ఇంటికి వెళ్లాడు. ఆ యువ‌తితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్ర‌మంలో త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో యువ‌తిపై దాడికి య‌త్నించాడు. యువ‌తి మెడ‌పై కోశాడు. అప్ర‌మ‌త్త‌మైన యువ‌తి కుటుంబ స‌భ్యులు వెంట‌నే అత‌డిని అడ్డుకునేందుకు య‌త్రించ‌డంతో.. అత‌డు అదే క‌త్తితో గొంతుకోసుకున్నాడు. తీవ్ర‌గాయం కావ‌డంతో అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువ‌తి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రాజ్ కుమార్ ఫోన్ ద్వారా వాట్స్ అప్ డేటాను సేకరిస్తున్నారు. యువతిని జగిత్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
Next Story
Share it