దారుణం.. స్నానం చేస్తుండగా వివాహిత ఫోటోలు తీసి.. ఏడాదిగా అత్యాచారం
వివాహిత స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫోటోలు తీసి ఏడాదిగా మహిళపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 3 March 2023 12:11 PM ISTఓ వివాహిత స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫోటోలు తీశాడు. వాటిని ఆ మహిళకు చూపించి బెదిరించాడు. తన మాట వినకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తానంటూ బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాకుండా లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. రోజు రోజుకి అతడి వేధింపులు ఎక్కువ అవుతుండడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ|(35) తన భర్తతో కలిసి కిరాణ దుకాణం నిర్వహిస్తోంది. విశాలాంధ్ర కాలనీలో నివాసం ఉంటున్న పుట్టా సుభాష్ (45) సరుకులు కొనుగోలు చేసేందుకు పలుమార్లు ఆమె దుకాణానికి వెళ్లాడు. ఫోన్ పే, పేటియం ద్వారా తాను కొన్న సరుకులకు నగదు చెల్లింపులు చేసేవాడు. ఈ క్రమంలో ఆమె నంబర్ తెలుసుకున్నాడు.
ఓ రోజు ఆ మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫోటోలు తీశాడు. తరువాత ఆ ఫోటోలను ఆమహిళకు చూపించి బెదిరించాడు. తాను చెప్పినట్లు చేయకపోతే ఫోటోలు అందరికి చూపిస్తానని బెదిరించాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగలేదు. ఆమెను బెదిరించి రూ.16లక్షల నగదును తీసుకున్నాడు.
తన వద్ద తీసుకున్న నగదును తిరిగి ఇవ్వాలని ఆమె ప్రాధేయపడగా కొట్టాడు. రోజురోజుకి అతడి వేధింపులు ఎక్కువ అవుతుండడంతో కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పింది. వారి సాయంతో సుభాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.