35 ముక్కలుగా నరుకుతానని బెదిరించి యువతిపై అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్‌ అరెస్ట్

Man arrested for raping, threatening to cut woman into pieces. దేశంలో రోజు రోజుకు మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు

By అంజి  Published on  19 Jan 2023 6:01 PM IST
35 ముక్కలుగా నరుకుతానని బెదిరించి యువతిపై అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్‌ అరెస్ట్

దేశంలో రోజు రోజుకు మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా కామాంధుల్లో ఎటువంటి మార్పు రావడం లేదు. తాజాగా 22 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి బెదిరించి పెళ్లి చేసుకోమని బలవంతం చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. నిందితుడు శుభం కుమార్. అదే పట్టణానికి చెందిన బాధితురాలిని తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. తన కోరికను నిరాకరిస్తే 35 ముక్కలుగా నరికేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు.

అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ రఘువంశీ మాట్లాడుతూ.. ''22 ఏళ్ల ముస్లిం యువతి నగరంలోని బంగంగా పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది. నిందితుడు బాలికతో శారీరక సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. తనను పెళ్లి చేసుకోకుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తానని కూడా బెదిరించాడు. అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఐపిసి అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు గత ఏడాది కాలంగా బాలికను వేధిస్తున్నాడు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది'' అని రఘువంశీ తెలిపారు.


Next Story