72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. పెళ్లిలో మిఠాయిలు చేయాలంటూ..

Man arrested for raping 72 year old woman in UP. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో అవమానీయ ఘటన జరిగింది. 72 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  17 Nov 2021 3:40 PM IST
72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. పెళ్లిలో మిఠాయిలు చేయాలంటూ..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో అవమానీయ ఘటన జరిగింది. 72 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యానికి కారకుడైన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో 72 ఏళ్ల వృద్ధురాలు నివస్తోంది. నవంబర్‌ 14వ తేదీన సాయంత్రం పని నిమిత్తం బోడ్లా అనే గ్రామానికి వెళ్లింది. బోడ్లా క్రాస్‌రోడ్ వద్ద 52 ఏళ్ల వ్యక్తి వికాస్‌ శర్మ.. పని ఇప్పిస్తానని వృద్ధురాలిని నమ్మించాడు. తాను పెళ్లికివెళ్తున్నానని, అక్కడ మిఠాయిలు చేయడానికి ఒక మహిళ అవసరమని చెప్పాడు.

వికాస్‌ శర్మ మాయ మాటలు, కొంత ఆదాయం వస్తుందని నమ్మిన వృద్ధురాలు అతనితో వెళ్లింది. దీంతో వృద్ధురాలిని ఇంట్లో బంధించి నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రోజు వృద్ధురాలు నిందితుడి చెర నుండి ఎలాగోలా తప్పించుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని జగదీష్‌పురా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీంద్ర కుమార్‌ సింగ్‌ తెలిపారు.

Next Story