Hyderabad: క్యాబిన్ అసిస్టెంట్ మహిళా పైలట్‌పై మేల్ పైలెట్ అత్యాచారం

బేగంపేట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 22 Nov 2025 10:08 AM IST

Crime News, Hyderabad, Begumpet Airport, Bengaluru, Rape Case

Hyderabad: క్యాబిన్ అసిస్టెంట్ మహిళా పైలట్‌పై మేల్ పైలెట్ అత్యాచారం

హైదరాబాద్: బేగంపేట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. క్యాబిన్ అసిస్టెంట్ మహిళ పైలట్‌పై మేల్ పైలెట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..ఈ నెల 20న బిజినెస్ ఫ్లైట్‌లో బేగంపేట నుంచి పుట్టపర్తి చెన్నై మీదుగా బాధితురాలు బెంగళూరు వెళ్లింది. సాయంత్రం 4.20 నిమిషాలకు బిజినెస్ ఫ్లైట్ బెంగళూరు చేరుకుంది.

అనంతరం బెంగళూరులోని ఓ హోటల్‌లో బస చేసిన మహిళా అసిస్టెంట్ పైలెట్‌తో పాటు మరో ఇద్దరు మేల్ పైలెట్లు బస చేశారు. అయితే ఇద్దరు పైలెట్లతో కలిసి బయటికి వచ్చిన బాధితురాలు తిరిగి హోటల్ రూమ్‌కి వెళ్లింది. ఆ తర్వాత సదరు పైలెట్‌ తనపై అత్యాచారం చేశాడని తిరిగి హైదరాబాద్ చేరుకుని బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బేగంపేట పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి, తిరిగి బెంగళూరుకు బదిలీ చేశారు.

Next Story