పెద్దమనిషి అయిన బాలిక.. దుస్తులపై రక్తం మరకలు.. తప్పుగా భావించి చెల్లెలి ప్రాణం తీసిన అన్న

12 ఏళ్ల బాలికను తన 30 ఏళ్ల సోదరుడు అతి కిరాతకంగా చంపాడు. బాలిక పెద్ద మనిషి అయిన సమయంలో.. ఆమె దుస్తులపై రక్తం

By అంజి
Published on : 10 May 2023 8:35 AM IST

Maharashtra, menstrual blood , Crime news

పెద్దమనిషి అయిన బాలిక.. దుస్తులపై రక్తం మరకలు.. తప్పుగా భావించి చెల్లెలి ప్రాణం తీసిన అన్న

12 ఏళ్ల బాలికను తన 30 ఏళ్ల సోదరుడు అతి కిరాతకంగా చంపాడు. బాలిక పెద్ద మనిషి అయిన సమయంలో.. ఆమె దుస్తులపై రక్తం మరకలు పడ్డాయి. అయితే ఈ రక్తం మరకలపై అనుమానించిన సోదరుడు బాలికను చిత్రహింసలకు గురి చేశాడు. ఎవరితోనే శారీరకంగా కలవడం వల్లే అలా జరిగిందని భావించి రోజుల తరబడి హింసించాడు. దీంతో మైనర్ బాలిక మరణించింది. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన 12 ఏళ్ల బాలికకు మొదటి రుతుక్రమం వచ్చింది. అయితే అనుమానంతో నిందితుడిని అతని భార్య కూడా రెచ్చగొట్టించింది. అక్రమ సంబంధం కారణంగా సోదరి దుస్తులపై రక్తం మరకలు పడ్డాయని సోదరుడు భావించాడు. దీంతో బాలిక ముఖం, కాళ్లు, చేతులు, వీపు ఇలా ఎక్కడ పడితే అక్కడ కాల్చి చిత్రవధ చేశాడు సోదరుడు.

బాలిక తల్లిదండ్రులు ఒక గ్రామంలో నివసిస్తున్నారు. ఆమె తన సోదరుడు, అతని భార్యతో ఉంటుంది. సోదరుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. మైనర్‌ను మూడు రోజుల పాటు నిరంతరం తన్నాడు. కొట్టాడు. ఆమె పరిస్థితి క్షీణించడంతో, ఆమెను ఉల్హాస్‌నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలికను పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదికలో బాలిక ముఖం, మెడ, వీపుపై చిత్రహింసల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Next Story