మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై కేసు నమోదైంది. అతను తన యజమానితో పడుకోవడానికి నిరాకరించినందుకు తన రెండో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. డిసెంబర్ 19న 45 ఏళ్ల వ్యక్తి తన 28 ఏళ్ల భార్యను పార్టీలో తన బాస్‌తో సన్నిహితంగా ఉండమని కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మొదటి భార్యకు తల్లిదండ్రుల ఇంటి నుంచి రూ.15 లక్షలు సమకూర్చాలని ఆ వ్యక్తి తన రెండో భార్యను కోరడంతో పరిస్థితి ఒక్కసారిగా మలుపు తిరిగింది.
అయితే, అతని రెండవ భార్య నిరాకరించడంతో ఆ వ్యక్తి తక్షణ ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 115(2), 351(2), 351(3), 352, ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019లోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయబడింది. బాధితురాలికి ఈ ఏడాది జనవరిలో వివాహం జరిగినట్లు సమాచారం. భర్త డబ్బు కోసం వేధించడం ప్రారంభించే ముందు మొదటి కొన్ని నెలలు భార్య సంతోషంగా ఉంది.
మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు రూ.15 లక్షలు అవసరమని, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి ఇప్పించాలని రెండో భార్యను వేధించాడు. తన యజమానితో పడుకోవడానికి నిరాకరించిన రెండో భార్యను భర్త శారీరకంగా వేధించాడు. ఉన్నపలంగా తలాక్ చెప్పి.. భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. దీని తర్వాత డిసెంబర్ 19 న భర్తపై కేసు పెట్టడానికి భార్య శంభాజీ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. కేసు మరుసటి రోజు కళ్యాణ్ బజార్‌పేట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయబడింది.