దారుణం.. భర్త మొదటి భార్యను 50 సార్లు కత్తితో పొడిచిన రెండో భార్య

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఓ మహిళ తన భర్త మొదటి భార్యతో గొడవ పడి కత్తితో 50 సార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటపడింది.

By అంజి  Published on  4 Nov 2024 7:14 AM IST
Madhya Pradesh, woman stabs husband first wife, argument, Crime

దారుణం.. భర్త మొదటి భార్యను 50 సార్లు కత్తితో పొడిచిన రెండో భార్య

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఓ మహిళ తన భర్త మొదటి భార్యతో గొడవ పడి కత్తితో 50 సార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటపడింది. వీడియోలో నిందితురాలు మాన్సీ జయను పదేపదే కత్తితో పొడిచినట్లు చూపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాన్సీ(22), జయ(26)లకు రాంబాబు వర్మ అనే వ్యక్తితో వివాహమైంది. దీపావళి, అక్టోబర్ 31న ఈ సంఘటన జరిగింది. మాన్సీ, జయ ఒక సమస్యపై వాదించుకున్నారు. అది హింసాత్మకంగా మారింది.

ఆవేశానికి లోనైన మాన్సీ కత్తితో జయను దాదాపు 50 సార్లు పొడిచింది. దాడి తర్వాత రక్తపు మడుగులో గాయపడి పడి ఉన్న జయ దగ్గర మాన్సీ నిలబడి ఉన్నట్టు వీడియో కనిపించింది. మాన్సీ.. జయ ముఖాన్ని తన్నడం, ఆమెను దుర్భాషలాడడం చూడవచ్చు. కంటెంట్ యొక్క స్వభావం కారణంగా సంఘటన యొక్క వీడియోను భాగస్వామ్యం చేయడం లేదు. జయ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటన గురించి అలర్ట్ అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని భారతీయ న్యాయ సంహియత (BNS) సంబంధిత సెక్షన్ల కింద మాన్సీని అరెస్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయకు రాంబాబు వర్మతో 2019లో వివాహమైంది. అయితే ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వర్మ 2021లో మాన్సీని పెళ్లి చేసుకున్నాడు.

ఈ కేసు గురించి సీనియర్ పోలీసు అధికారి ఉదిత్ మిశ్రా మాట్లాడుతూ, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. "రాంబాబు మొదటి భార్య జయ తరచుగా అస్వస్థతకు గురౌతున్నారని, దీంతో అతను మాన్సీ పెళ్లి చేసుకున్నాడని. విచారణలో భాగంగా బాధితురాలి స్టేట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని" మిశ్రా మీడియాకు తెలిపారు.

Next Story