భ‌ర్త అంగాన్ని కోసేసిన భార్య‌.. ఇష్టం లేకుండా ఆ ప‌ని చేస్తున్నాడ‌ని

Madhya pradesh woman cuts off husband's genitals.మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని టిక‌మ్‌గ‌డ్ పట్ట‌ణంలో దారుణం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2021 6:16 AM GMT
భ‌ర్త అంగాన్ని కోసేసిన భార్య‌.. ఇష్టం లేకుండా ఆ ప‌ని చేస్తున్నాడ‌ని

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని టిక‌మ్‌గ‌డ్ పట్ట‌ణంలో దారుణం జ‌రిగింది. శృంగారంలో పాల్గొనాల‌ని భ‌ర్త బ‌లవంతం చేశాడ‌ని ఓ మ‌హిళ‌.. అత‌డి జ‌న‌నాంగాల‌ను కోసేసింది. దీంతో బాధితుడికి తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగింది. శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న అనంత‌రం స‌ద‌రు భ‌ర్త‌.. భార్య‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. 2019 సంవ‌త్స‌రంలో టికామ్‌ఘడ్ పట్టణానికి చెందిన 26 ఏళ్ల వ్య‌క్తి కి 24 ఏళ్ల ఓ మ‌హిళ‌తో వివాహాం జ‌రిగింది. వివాహాం జ‌రిగిన అనంత‌రం కొన్ని గొడ‌వ‌ల కార‌ణంగా వారిద్ద‌రూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవ‌ల పెద్ద స‌మ‌క్షంలో పంచాయ‌తీ అనంత‌రం వారిద్ద‌రూ క‌లిసి ఉంటున్నారు. ఈ క్ర‌మంలో డిసెంబ‌ర్ 7 రాత్రి త‌న ఇష్టానికి విరుద్దంగా భ‌ర్త.. త‌న‌తో లైంగిక సంబంధం పెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌నే కోపంతో భార్య వంట‌గ‌దిలోని క‌త్తితో అత‌డి జ‌న‌నాంగాన్ని కోసేసింది.

బాధితుడికి తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగింది. చుట్టు ప్రక్క‌ల వారు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో శ‌స్త్ర‌చికిత్స చేశారు. దీంతో కొంత ఆల‌స్యంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు జాతర పోలీసు స్టేషన్ అధికారి త్రివేంద్ర త్రివేది చెప్పారు. భార్యపై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించారు.

Next Story
Share it