మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో 37 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, మరో వ్యక్తిని తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ వీడియోను వదిలి అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు శనివారం తెలిపారు. విషం తిని ఆ వ్యక్తి గురువారం మృతి చెందాడు. ఆత్మహత్యకు ముందు, అతను తన మొబైల్ ఫోన్‌లో వీడియోను రికార్డ్ చేశాడని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) మనోజ్ కుమార్ రాయ్ తెలిపారు. దాదాపు నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో.. తన భార్య, మరొక వ్యక్తి తనను వేధించారని, దీంతో తీవ్ర చర్య తీసుకోవలసి వచ్చిందని బాధితుడు పేర్కొన్నాడు.
తాను చాలా బాధలో ఉన్నానని పదే పదే చెప్పాడు. మరో వ్యక్తి తన భార్యతో చాలా రోజులుగా శృంగారం చేస్తున్నాడని ఆరోపించాడు. ఈ విషయం తెలిసి గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పారు. తనకు న్యాయం చేయాలని, తన భార్యతో పాటు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తిని శిక్షించాలని బాధితుడు చెప్పాడు. తన భార్యతో కలిసి ఉండాలనుకున్నానని, అయితే ఆమె తనతో కలిసి జీవించడానికి నిరాకరించిందని చెప్పాడు. వీడియో నుండి వచ్చే వాస్తవాల ఆధారంగా, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.
బెంగుళూరుకు చెందిన ఒక టెక్కీ తన జీవితాన్ని ముగించిన వారాల తర్వాత ఈ ఘటన జరిగింది. టెక్కీ సుభాష్.. అతని భార్య, అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ వీడియో , సుదీర్ఘ సూసైడ్ నోట్‌ను వదిలివెళ్లాడు.