ఈ 19 ప్రాంతాల్లో మద్యం బంద్‌

మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నాడు రాష్ట్రంలోని 19 మతపరమైన నగరాలు, ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రాంతాలలో మద్యాన్ని నిషేధించింది.

By Medi Samrat
Published on : 1 April 2025 4:36 PM IST

ఈ 19 ప్రాంతాల్లో మద్యం బంద్‌

మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నాడు రాష్ట్రంలోని 19 మతపరమైన నగరాలు, ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రాంతాలలో మద్యాన్ని నిషేధించింది. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మైహార్ వంటి 19 ప్రదేశాలలో మద్యపానంపై పూర్తి నిషేధం విధించారు. పవిత్రమైన ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు అక్రమంగా ఎవరైనా జరిపితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. మద్యపానం వ్యసన నిర్మూలన దిశగా చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.

మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేయనున్న పట్టణ ప్రాంతాలు ఇవే:

ఉజ్జయిని

ఓంకారేశ్వర్

మహేశ్వర్

మండలేశ్వర్

ఓర్చా

మైహార్

చిత్రకూట్

దతియా

పన్నా

మండ్లా

ముల్తాయ్

మంద్సౌర్

అమర్‌కాంతక్

ఈ గ్రామ పంచాయతీ పరిధిలో నిషేధం అమలు చేయనున్నారు:

సల్కన్‌పూర్

కుందల్‌పూర్

బందక్‌పూర్

బర్మాన్‌కలన్

బర్మాన్‌ఖుర్ద్

లింగ

Next Story