11 ఏళ్ల బాలికపై కసాయి తండ్రి అత్యాచారం.. తల్లికి తెలిసే.. ఏడాది నుంచి వేధింపులు

Ludhiana man booked for violating 11-year-old daughter for 1 year. అభం శుభం తెలియని 11 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. కంటి రెప్పలా కాపాడుకోవాల్సిన

By అంజి  Published on  4 Dec 2022 10:15 AM IST
11 ఏళ్ల బాలికపై కసాయి తండ్రి అత్యాచారం.. తల్లికి తెలిసే.. ఏడాది నుంచి వేధింపులు

అభం శుభం తెలియని 11 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. కంటి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. సంవత్సర కాలంగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. ఈ ఘటన పంజాబ్‌లోని లుథియానాలో జరిగింది. శరభా నగర్ పోలీసులు నిన్న తన 11 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడు గత ఏడాది కాలంగా కూతురిపై అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం ఓ సామాజిక కార్యకర్తకు తెలియడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

నిందితుడిని అయాలీ చౌక్‌లోని అవతార్ నగర్‌లో నివాసం ఉంటున్న ముఖేష్ కుమార్ మహతోగా గుర్తించారు. గత ఏడాది కాలంగా మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం చేస్తున్నాడని ఆమె స్నేహితురాలు ఒకరు తెలియజేశారని, ఆ విషయం బాలిక కుటుంబ సభ్యులకు కూడా తెలిసిందని ఫిర్యాదుదారు మన్‌దీప్ కౌర్ సంధు అనే సామాజిక కార్యకర్త పోలీసులకు తెలిపారు. తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేకపోవడంతో ఈ విషయం ఇన్ని రోజులు వెలుగులోకి రాలేదు.

''అమ్మాయి లైంగిక వేధింపుల గురించి తెలుసుకున్న తర్వాత నేను, నా స్నేహితుడితో కలిసి బాధితురాలితో వ్యక్తిగతంగా మాట్లాడిన అమ్మాయి ఇంటికి వెళ్లాను. గత ఏడాది కాలంగా తన తండ్రి తనతో లైంగిక సంబంధం పెంచుకుంటున్నాడని, తన తల్లికి, ఇతర కుటుంబ సభ్యులకు కూడా తెలుసు, కానీ తన తండ్రిని ఎవరూ అడ్డుకునే ధైర్యం చేయలేదని ఆమె మాకు చెప్పింది'' అని మన్‌దీప్‌ కౌర్‌ సంధు చెప్పారు. తన తండ్రి అసలు రూపాన్ని బయటపెట్టినందుకు కుటుంబ సభ్యులు తనను హింసిస్తారనే భయంతో బాలిక తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఏఎస్సై భూపీందర్ సింగ్ తెలిపారు.

Next Story