బాలికపై పదే పదే అత్యాచారం.. అసభ్యకరమైన వీడియోతో బ్లాక్‌మెయిల్ చేస్తూ..

Lucknow man held for raping girl, blackmailing her with obscene video. 23 ఏళ్ల యువకుడైన బట్టల దుకాణం యజమాని.. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

By అంజి  Published on  5 Jan 2023 10:30 AM GMT
బాలికపై పదే పదే అత్యాచారం.. అసభ్యకరమైన వీడియోతో బ్లాక్‌మెయిల్ చేస్తూ..

23 ఏళ్ల యువకుడైన బట్టల దుకాణం యజమాని.. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ చర్యను రికార్డ్ చేసి బాలికను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఆ అశ్లీల వీడియోను వైరల్‌ చేస్తానని బెదిరించి బాలికపై పదే పేద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సూరజ్ తివారీ అనే నిందితుడు 2021లో బాధితురాలిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కలిశాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో తాను ఉద్యోగం కోసం వెతుకుతున్నానని సూరజ్‌కు చెప్పింది. ఇది విన్న నిందితుడు.. దగ్గర్లోనే సేల్స్‌గర్ల్ కోసం వెతుకుతున్న బట్టల షోరూమ్ ఉందని చెప్పాడు.

ఆమె షోరూమ్‌లో సేల్స్ గర్ల్‌గా పని చేయడం ప్రారంభించింది. అదే సమయంలో సూరజ్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి ఫోటోలు, వీడియోలు కూడా తీశాడు. అంతేకాకుండా అసభ్యకరమైన వీడియోను వైరల్ చేస్తానని బెదిరించడం ద్వారా, అతను చాలాసార్లు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చిత్రహింసలు భరించలేక 2022 ఫిబ్రవరిలో ఆమె ఉద్యోగం మానేసింది. అయినా నిందితుడు తన చర్యలను ఆపలేదు. అతను నవంబర్ 2022లో బాలిక ఇంటికి చేరుకుని, ఆమెను బెదిరించాడు. పని చేయడానికి తన దుకాణానికి రావాలని కోరాడు.

షాపు వద్దకు చేరుకోగానే మరోసారి లైంగికంగా వేధించాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె ఆటోలో ఇంటికి వెళ్తుండగా నిందితుడు సూరజ్ ఆమెను వెంబడించి దారిలో ఆటోను ఆపి బెదిరించాడు. ఆమె అసభ్యకర చిత్రాలను చూపించి వాటిని వైరల్ చేస్తానని బెదిరించింది. మానసిక హింస భరించలేక బాధితురాలు సూరజ్ తివారీపై లక్నోలోని అషియానా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఆషియానా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. ''ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా, 23 ఏళ్ల సూరజ్ తివారీపై IPC సెక్షన్లు 376, 323, 504, 506 కింద అభియోగాలు మోపారు. అతన్ని అరెస్టు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది" అని అన్నారు.

Next Story