ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ, ఇంట్లో ఒప్పుకోరని రైలుకిందపడిన జంట

సోషల్ మీడియాలో మొదలైన ప్రేమ విషాదంగా ముగిసింది.

By Knakam Karthik
Published on : 17 March 2025 12:26 PM IST

Crime News, Telangana, Karimnagar District, Socil Media Love

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ, ఇంట్లో ఒప్పుకోరని రైలుకిందపడిన జంట

సోషల్ మీడియాలో మొదలైన ప్రేమ విషాదంగా ముగిసింది. ఈ సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన రాహుల్‌ (18)కు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన శ్వేత (20) కు కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ప్రేమ విషయం తమ ఇంట్లో ఒప్పుకోరని భయపడి క్షణికావేశంలో ఇద్దరు జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేషన్-పాపయ్యపల్లె గేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story