విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య.. కలకలం రేపుతోన్న సెల్ఫీ వీడియో

Love couple suicide in Janagama district. తెలంగాణలోని జనగామ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట సూసైడ్‌ చేసుకుంది. ప్రేమికులు ఆత్మహత్యకు

By అంజి  Published on  13 Aug 2022 12:03 PM IST
విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య.. కలకలం రేపుతోన్న సెల్ఫీ వీడియో

తెలంగాణలోని జనగామ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట సూసైడ్‌ చేసుకుంది. ప్రేమికులు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వీడియోలో తమ ఆత్మహత్యకు గల కారణాన్ని వివరించారు. పాలకుర్తి మండలం బిక్యానాయక్‌ తండాలో చోటు చేసుకున్న ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. బిక్యానాయక్‌ తండాకు చెందిన గుగులోత్‌ రాజు (20), బానోతు దీపిక (16) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఇద్దరూ వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే తమ పెళ్లికి కుటుంబ సభ్యులు, పెద్దలు అంగీకరించరని వారిలో వారే మదనపడిపోయారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆత్మహత్య ముందు ఇద్దరూ కలిసి సెల్ఫీ వీడియో తీసి, తాము చనిపోతున్నట్లు తెలిపారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. దాంతో యువతీయువకుడు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. చేతికొచ్చిన బిడ్డలు ఆత్మహత్య చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

Next Story