Rangareddy : కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.

By Medi Samrat
Published on : 2 Dec 2024 12:06 PM

Rangareddy : కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ -బీజాపుర్‌ రహదారి వద్ద కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకెళ్ళింది. ఈ ఘటనలో 10మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. వ్యాపారులపైకి దూసుకెళ్లి చెట్టును ఢీకొని లారీ ఆగిపోగా డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో మొత్తం 50 మందికి పైగా వ్యాపారులు రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story