Telangana : టోల్ బూత్‌లోకి దూసుకెళ్లిన లారీ

శనివారం హైదరాబాద్-వరంగల్ హైవేలోని రఘునాథపల్లి సమీపంలోని కోమల్ల వద్ద వేగంగా వస్తున్న లారీ టోల్ బూత్‌లోకి దూసుకెళ్లింది,

By Medi Samrat
Published on : 19 April 2025 8:30 PM IST

Telangana : టోల్ బూత్‌లోకి దూసుకెళ్లిన లారీ

శనివారం హైదరాబాద్-వరంగల్ హైవేలోని రఘునాథపల్లి సమీపంలోని కోమల్ల వద్ద వేగంగా వస్తున్న లారీ టోల్ బూత్‌లోకి దూసుకెళ్లింది, ఈ ప్రమాదంలో టోల్ బూత్ సిబ్బంది గాయపడగా, కారుకు కూడా నష్టం వాటిల్లింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టోల్ గేట్ యాజమాన్యం ఫిర్యాదు ఆధారంగా, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనలో అక్కడ ఉన్న సామాగ్రి ధ్వంసమైనట్లు సమాచారం. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్ జామ్ కాకుండా సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Next Story