రోడ్డు ప్ర‌మాదంలో జర్నలిస్ట్‌ దుర్మరణం

Lorry Collide with Bike in Begumpet one dead.హైద‌రాబాద్ న‌గ‌రంలోని బేగంపేట‌లో లారీ బైక్‌ను ఢీ కొట్టింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2021 3:57 AM GMT
రోడ్డు ప్ర‌మాదంలో జర్నలిస్ట్‌ దుర్మరణం

హైద‌రాబాద్ న‌గ‌రంలోని బేగంపేట‌లో లారీ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఓ జ‌ర్న‌లిస్టు మృతి చెందారు. శుక్ర‌వారం ఉద‌యం బేగంపేట‌లోని హైద‌రాబాద్ పబ్లిక్ స్కూల్ ద‌గ్గ‌ర ఓ లారీ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ద్విచ‌క్ర‌వాహ‌నం పై ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తి అక్కడిక‌క్క‌డే మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మృతుడిని మ‌ధుసూధ‌న్ గా గుర్తించారు. మ‌ధు ఓ ప్రముఖ మీడియా సంస్థ‌లో ఆన్‌లైన్ స‌బ్ ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ రోజు ఉద‌యం కార్యాల‌యానికి వెలుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఘ‌ట‌న అనంత‌రం లారీ ఆప‌కుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. ఈ ప్ర‌మాదం పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీ కెమెరాలల్లో న‌మోదు అయిన దృశ్యాల ఆధారంగా ఆ లారీని గుర్తించిన‌ట్లు తెలుస్తోంది.

Next Story
Share it