Kurnool: భర్తను ఇంట్లోనే దహనం చేసిన భార్య
గుండెపోటు వచ్చిందనే కారణంతో 55 ఏళ్ల మహిళ తన భర్తను ఇంట్లోనే దహనం చేసింది. లలిత అనే మహిళ తన భర్త అంత్యక్రియలకు పాత బట్టలు,
By అంజి Published on 31 May 2023 7:45 AM ISTKurnool: భర్తను ఇంట్లోనే దహనం చేసిన భార్య
గుండెపోటు వచ్చిందనే కారణంతో 55 ఏళ్ల మహిళ తన భర్తను ఇంట్లోనే దహనం చేసింది. లలిత అనే మహిళ తన భర్త అంత్యక్రియలకు పాత బట్టలు, పుస్తకాలను ఉపయోగించింది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. ఫార్మసీ నడుపుతున్న హరికృష్ణ ప్రసాద్ (63) గత కొన్నేళ్లుగా మంచాన పడ్డాడు. తమ ఇద్దరు కుమారులు తమను నిర్లక్ష్యం చేశారని అతని భార్య తెలిపింది. పెద్ద కొడుకు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా, చిన్న కొడుకు కెనడాలో స్థిరపడ్డాడు. ఆ మహిళ తన భర్తను, మెడికల్ షాపును చూసుకునేది.
పత్తికొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మురళీమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. లలిత తన భర్త ఆరోగ్యం బాగోలేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దహన సంస్కారాలకు ఎలాంటి సహాయం అందదని భావించిన ఆమె ఇంట్లోనే అతని అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. భర్తకు అంత్యక్రియలు చేసేందుకు మహిళ పాత బట్టలు, పుస్తకాలను ఉపయోగించగా, ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
తమ కొడుకులు తమ బాగోగులు చూసుకోలేదని, ఆస్తిలో వాటా ఇవ్వాలని మాత్రమే ఇంటికి వచ్చారని మహిళ చెప్పింది. తండ్రి మరణవార్త తెలిసి ఆస్తి కోసం గొడవ పడిపోతారనే భయంతో లలిత వారికి చెప్పలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లలిత మానసిక పరిస్థితి నిలకడగా ఉందని ఇరుగుపొరుగు వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.