Kurnool: ఏడేళ్ల బాలికపై వ్యక్తి లైంగిక వేధింపులు.. చాక్లెట్‌ ఆశ చూపి..

ఆంధ్రప్రదేశ్‌లో ఏడేళ్ల బాలికపై 35 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నంద్యాల జిల్లా కొలుములపల్లిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.

By అంజి  Published on  13 Nov 2024 9:30 AM IST
Kurnool, POCSO case, abusing girl, Crime

Kurnool: ఏడేళ్ల బాలికపై వ్యక్తి లైంగిక వేధింపులు.. చాక్లెట్‌ ఆశ చూపి

దేశంలో రోజు రోజుకు ఆడ పిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా మానవ మృగాలు తమ కామ వాంఛను తీర్చుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఏడేళ్ల బాలికపై 35 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నంద్యాల జిల్లా కొలుములపల్లిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. నిందితుడు ఎల్లయ్య (35)పై బేతంచెర్ల పోలీసులు బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.

నవంబరు 7న ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిందితుడు చాక్లెట్‌ ఆశ చూపించి లాక్కెళ్లారని బేతంచెర్ల సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. నిందితుడు ఎల్లయ్య పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని సబ్‌ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Next Story