ఈ మద్య డబ్బు సంపాదించడమే పరమావధిగా కొంత మంది నేరగాళ్లు ఎదుటివారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా యువతను మత్తులో ముంచెత్తి ఇష్టానుసారంగా డబ్బు సంపాదిస్తున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా నేరగాళ్లను మాత్రం అంతం చేయలేకపోతున్నారు. మత్తులో జోగుతున్న యువత ఆడవారిపై అఘాయిత్యాలు, హత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే.
ఆ మద్య హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ కలకలం సృష్టించింది. తాజాగా ఢిల్లీ, కులు జిల్లా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో భారీ మొత్తం విలువ చేసే హెరాయిన్ను పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 30 కోట్ల వరకు ఉంటుందని హిమాచల్ ప్రదేశ్ డీజీపీ సంజయ్ కుందు తెలిపారు. గత కొంత కాలంగా ఇక్కడ మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా వాడుతున్నట్టు సమాచం తెలుసుకున్న పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
పక్కా సమాచారంతో నింధితులను పట్టుకున్నారు. అయితే ఇంత మొత్తం విలువ చేసే హెరాయిన్ను తమ రాష్ట్రంలో పట్టుకోవడం ఇదే మొదటిసారి అని డీజీపీ పేర్కొన్నారు. ఐవరీకోస్ట్ జాతీయుడి నుంచి హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.