సహోద్యోగితో మహిళా కండక్టర్ అక్రమ సంబంధం.. సీరియ‌స్‌గా రియాక్టైన సంస్థ

మహిళా కండెక్టర్ సహోద్యోగితో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడంతో ఆమెను ఉద్యోగం నుండి తీసివేశారు.

By Medi Samrat
Published on : 12 July 2025 6:32 PM IST

సహోద్యోగితో మహిళా కండక్టర్ అక్రమ సంబంధం.. సీరియ‌స్‌గా రియాక్టైన సంస్థ

మహిళా కండెక్టర్ సహోద్యోగితో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడంతో ఆమెను ఉద్యోగం నుండి తీసివేశారు. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) మహిళా కండెక్టర్ ఒక సహోద్యోగితో అక్రమ సంబంధం కలిగి ఉన్నారనే ఫిర్యాదు ఆధారంగా ఆమెను సస్పెండ్ చేసింది. ఆ పురుష డ్రైవర్ భార్య రవాణా మంత్రి KB గణేష్ కుమార్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.

మాట్లాడుతూ డ్రైవర్ దృష్టిని మళ్లించడం, ప్రయాణీకులను సకాలంలో గమ్యస్థానానికి చేర్చకపోవడం లాంటివి మహిళా కండక్టర్ తప్పిదాలుగా సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. జూలై 8న KSRTC విజిలెన్స్ విభాగం జారీ చేసిన ఉత్తర్వులో మహిళా కండక్టర్ పేరు ఉన్నప్పటికీ, ఆమెతో సంబంధంలో ఉన్నట్లు ఆరోపణ‌లు ఎదుర్కొంటున్న వ్యక్తి గురించి ప్రస్తావించలేదు.

Next Story