బ్రేకింగ్‌: కుకట్‌పల్లి.. ఎలక్ట్రికల్‌ హార్డ్‌వేర్‌ షాపులో భారీ అగ్ని ప్రమాదం

KPHB Fire accident I ... హైదరాబాద్‌ నగరంలో అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదివారం ఉదయం

By సుభాష్  Published on  15 Nov 2020 9:08 AM IST
బ్రేకింగ్‌: కుకట్‌పల్లి.. ఎలక్ట్రికల్‌ హార్డ్‌వేర్‌ షాపులో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ నగరంలో అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా కేపీహెచ్‌బీ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాందేవ్‌ ఎలక్ట్రికల్‌ హార్డ్‌వేర్‌ షాపులో ఒకక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ ప్రమాదం షాట్ సర్క్యూట్‌ కారణంగానే జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా షాపులోని సామాగ్రి అంతా అగ్నికి ఆహుతైంది. అయితే ఈ ప్రమాదంలో ఎంత వరకు నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

అబిడ్స్‌లో..

కాగా, నిన్న నగరంలోని అబిడ్స్‌ సమీపంలోని గన్‌ఫౌండ్రీలో అగ్ని ప్రమాదం సంభవించింది. చెప్పుల దుకాణం, గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చెప్పులన్ని కాలిబూడిదయ్యాయి. పక్కనే ఉన్న హోటల్‌, దాబాకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో దుకాణాల్లో ఫర్నిచర్‌, సామాగ్రి కాలిబూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Next Story