పోలీస్ స్టేషన్‌లో మహిళతో రాసలీలలు.. అడ్డంగా బుక్కైన ఏఎస్‌ఐ
Kothakota: ASI caught with woman in compromising position at police station. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ఓ పోలీసు.. చేయకూడని పనులు చేసి చిక్కాడు. పోలీస్‌స్టేషన్‌ను బెడ్‌రూమ్‌గా మార్చుకుని
By అంజి Published on 30 Aug 2022 9:20 AM GMTబాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ఓ పోలీసు.. చేయకూడని పనులు చేసి చిక్కాడు. పోలీస్‌స్టేషన్‌ను బెడ్‌రూమ్‌గా మార్చుకుని అడ్డంగా దొరికిపోయాడు. డ్యూటీలో బాగా మద్యం సేవించి, పీఎస్‌కు ఓ మహిళను తీసుకొచ్చి రాసలీలలు చేశాడు. ఈ ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లాలో జరిగింది. కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళతో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) రాసలీలలు చేస్తుండగా.. అదే సమయంలో సీఐ స్టేషన్‌కు వచ్చాడు. ఏఎస్‌ఐ మహిళతో ఏకాంతంగా గడపడం చూశాడు.
రావికమతం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ ఎ అప్పారావును పోలీసులు సస్పెండ్ చేశారు. అతనిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది కొరత కారణంగా అప్పారావు 10 రోజులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఏఎస్‌ఐ ఒకట్రెండు నెలల్లో సర్వీసు నుండి రిటైర్ అవనున్నాడు. ఇంతలోనే ఇలా పాడు పని చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. విధులకు హాజరైన అతడు ఆదివారం రాత్రి మద్యం సేవించి ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాడని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి డ్యూటీకి హాజరైన ఏఎస్‌ఐ చర్యను హెడ్ కానిస్టేబుల్ జాషువా వ్యతిరేకించారు. అయితే అప్పారావు హెడ్ కానిస్టేబుల్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) సయ్యద్ ఇలియాస్ మహ్మద్, సబ్ ఇన్‌స్పెక్టర్ అప్పల నాయుడులకు సమాచారం అందించారు. సయ్యద్ ఇలియాస్ మహ్మద్ మాట్లాడుతూ.. వెంటనే స్టేషన్‌కు చేరుకున్నామని, స్టేషన్‌లో మహిళతో ఏఎస్‌ఐ ఉన్నట్లు గుర్తించారు. హెడ్ కానిస్టేబుల్‌తో ఏఎస్ఐ ప్రవర్తనను ఇద్దరు హోంగార్డులు కూడా చూశారు.
"మేము మహిళను ఇంటికి తీసుకెళ్లాము. రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ (బిఎసి) నిర్ధారించడానికి వైద్య పరీక్షల కోసం ఏఎస్‌ఐ అప్పారావును నర్శీపట్నం ఆసుపత్రికి పంపాం." అని అతను చెప్పాడు. ఏఎస్సైని సస్పెండ్ చేశామని, శాఖాపరమైన విచారణ ప్రారంభించామని అనకాపల్లి సూపరింటెండెంట్ గౌతమి సాలి తెలిపారు. అప్పారావును సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కాదని పోలీసులు తెలిపారు. అతను కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్నప్పుడు, ఇసుక మాఫియాతో సంబంధం ఉన్నందున అతన్ని సస్పెండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.