ట్రైనీ డాక్టర్‌పై దారుణం.. నిందితులకు ఉరిశిక్ష విధిస్తాం : సీఎం

బెంగాల్‌లో మహిళా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై ఉత్కంఠ నెలకొంది.

By Medi Samrat  Published on  10 Aug 2024 11:57 AM GMT
ట్రైనీ డాక్టర్‌పై దారుణం.. నిందితులకు ఉరిశిక్ష విధిస్తాం : సీఎం

బెంగాల్‌లో మహిళా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో సీఎం మమతా బెనర్జీ కూడా స్పందించారు. నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తామని సీఎం చెప్పారు.

ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి చేసి.. హత్య చేసిన కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని తమ ప్రభుత్వం కోరుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిగేలా చూడాలని అధికారులను కోరినట్లు బెనర్జీ తెలిపారు.

శుక్రవారం ఉత్తర కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి సెమినార్ హాల్‌లో మహిళా డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో హత్యకు, లైంగిక దాడి జరిగినట్లు తేలింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన, ఊరేగింపు న్యాయమేనని ముఖ్యమంత్రి అన్నారు.

జూనియర్ డాక్టర్లు చేస్తున్న డిమాండ్లకు నేను మద్దతిస్తున్నాను' అని మమత బెంగాలీ న్యూస్ ఛానెల్‌తో అన్నారు. ఒకవేళ కోరితే సీబీఐతో సహా ఏ ఏజెన్సీ ద్వారానైనా కేసు దర్యాప్తు చేయించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని మ‌మ‌త‌ అన్నారు.

ఈ ఘటనపై జూనియర్ డాక్టర్లు నిరసనలు తెలుపుతూ.. ఆరోగ్య సేవలను కొనసాగించాలని నిర్ణ‌యించారు. అంతకుముందు కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మాట్లాడుతూ.. నిందితుడికి కఠినమైన శిక్ష పడుతుంద‌ని అన్నారు.

Next Story