కోల్‌కతాలోని సర్వే పార్క్ ప్రాంతంలో 31 ఏళ్ల వ్యక్తి బొమ్మ తుపాకీని ఉపయోగించి బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. తపాలా శాఖ ఉద్యోగి అయిన దలీమ్ బసు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఓ బ్యాంకుకు వెళ్ళాడు. అక్కడ బొమ్మ తుపాకీని చూపించి, ఖాతాదారులను, బ్యాంకర్లను మీ వద్ద ఉన్నవన్నీ తనకు అప్పగించమని కోరాడని ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఆ బ్యాంకు ఖాతాదారుడైన బసు హోమ్ లోన్, ఇతర ఖర్చులను చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో డబ్బుల అవసరం కారణంగా ఈ పని చేశాడని పోలీసులు చెప్పారు. అతను బొమ్మ తుపాకీతో బెదిరిస్తున్నాడని అనుమానం వ్యక్తం చేసిన బ్యాంకు మేనేజర్, ఖాతాదారులు అతన్ని వెనుక నుండి పట్టుకున్నారరు. అతన్ని పోలీసులకు అప్పగించారు. బొమ్మ తుపాకీతో పాటు, అతని వద్ద నుండి ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.