భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. కీలక ఆధారాలు లభ్యం
హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను కిరాతకంగా నరికి ముక్కలు ఉడికించిన కేసులో పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు. శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లను పోలీసులు సేకరించారు.
By అంజి Published on 24 Jan 2025 11:07 AM ISTభార్యను ముక్కలుగా నరికిన ఘటన.. కీలక ఆధారాలు లభ్యం
హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను కిరాతకంగా నరికి ముక్కలు ఉడికించిన కేసులో పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు. శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లను పోలీసులు సేకరించారు. వాటి డీఎన్‌ఏ శాంపిల్స్ తీసుకున్న పోలీసులు.. పిల్లల డీఎన్‌ఏతో టెస్ట్ చేయనున్నారు. భార్య మాధవి హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో శుభ్రం చేసిన రక్తపు మరకలను ఇన్‌ఫ్రారెడ్ ద్వారా గుర్తించారు.
ఈ కేసులో పోలీసులు గురుమూర్తి పిల్లల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలిద్దరూ అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. పండగ తర్వాత ఇంట్లోకి రాగానే దారుణమైన వాసన వచ్చిందని గురుమూర్తి కూతురు పోలీసులకు చెప్పింది. అంతేకాకుండా అమ్మ ఎక్కడ అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని గురుమూర్తి కూతురు పోలీసులకు వెల్లడించింది. మరో వైపు పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసు కొని విచారణ చేయగా తన భార్య మాధవిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. మరికొన్ని ప్రశ్నలకు మాత్రం గురుమూర్తి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.
చంపిన విధానంపై పోలీసులకు రెండు, మూడు వెర్షన్స్ చెప్తున్నాడు. ఇంట్లోని బాత్రూం లోనే మాధవి మృత దేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలు గా కట్ చేసిన గురుమూర్తి ఆ రక్తపు మరకలు కనిపించకుండా పది సార్లు ఫినాయిల్ తో శుభ్రం చేశాడు. ఆ విధంగా ముక్కలు చేసిన వాటిని ఉడకబెట్టి పొడి చేసి చెరువులో పారేశానని గురుమూర్తి చెప్ప డంతో పోలీసులు నిన్న రాత్రి గురు మూర్తిని మరోసారి చెరువు వద్దకు తీసుకువెళ్లి మాధవి మృతదేహం యొక్క ఆనవాళ్లు చెరువులో వెతికేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి ఆనవాళ్లు చెరువు లో లభ్యం కాలేదు. దీంతో పోలీసులు, క్లూస్ టీమ్ మరో మారు ఇంట్లో క్షుణ్ణం గా పరిశీలించగా శరీర భాగాలు కాల్చిన ఆనవాళ్లు, రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే క్లూస్ టీం.. డిఎన్ఎస్ శాంపిల్స్ సేకరించి టెస్టుకు పంపించారు.