మూడు రోజుల క్రితం జెవార్‌లో 55 ఏళ్ల దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా పోలీసులు బుధవారం తెలిపారు. మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం ఉద‌యం బాధిత మ‌హిళ‌పై తుపాకీ గురిపెట్టి గ్రామం సమీపంలోని బహిరంగ ప్ర‌దేశానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అయితే పోలీసులు నిందితుల్లో ఒకరిని సోమవారం అరెస్టు చేయ‌గా.. మ‌రొక నిందితుడైన మ‌హేంద్ర‌ను బుధ‌వారం అరెస్టు చేశారు. మహేంద్ర సమాచారం కోసం రూ.25,000 రివార్డ్ కూడా ప్రకటించారు పోలీసులు. నిందితుల‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376D, 352, 506, అట్రాసిటీ 1989 సెక్ష‌న్‌ల‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహేంద్రపై గతంలో దొంగతనం కేసులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప‌రారీలో ఉన్న మిగ‌తా నిందితుల గూర్చి తెలియాల్సివుంది.సామ్రాట్

Next Story