ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. యువ‌తిని పిలిచి దారుణానికి ఒడిగ‌ట్టిన వ్య‌క్తి

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఒక మహిళను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు

By Medi Samrat  Published on  24 Aug 2024 9:30 PM IST
ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. యువ‌తిని పిలిచి దారుణానికి ఒడిగ‌ట్టిన వ్య‌క్తి

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఒక మహిళను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి మహిళతో పరిచయం పెంచుకున్నాడు.. కలుద్దామని పిలవగానే ఆమె ఆ వ్యక్తిని నమ్మేసింది. తనతో కారులో రావాలంటూ మహిళను అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు మరో కారులో వచ్చి వీరికి బీరు సీసాలను అందించారు. బీరులో మత్తు మందు కలిపించి అమ్మాయికి కూడా తాగించారు. ఆ తర్వాత నిందితుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన శుక్రవారం కర్కాలలో జరిగింది.

నిందితుడు బీరులో డ్రగ్స్ కలిపి మహిళకు బలవంతంగా తాగించి అపస్మారక స్థితికి చేరుకునేలా చేశాడు. ఆ తర్వాత కారులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు మహిళను ఇంటికి దింపడానికి వెళ్లినప్పుడు, రైట్ వింగ్ కార్యకర్తలు అతని కారును అడ్డగించారు. మద్యం మత్తులో ఉన్న మహిళను గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నిందితుడితో పాటు అతడి స్నేహితుడిని కూడా అరెస్టు చేసి కిడ్నాప్, అత్యాచారం, ఇతర నేరాలపై కేసు నమోదు చేశారు. సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ మహిళ కుటుంబం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. "మహిళ స్టేట్‌మెంట్‌ను జ్యుడిషియల్ ఆఫీసర్ రికార్డ్ చేస్తారు. మెడికల్ రిపోర్టులను పరిశీలిస్తారు" అని ఉడిపికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అరుణ్ చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story