ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన భార్య.. సరస్సులో భర్త శవం.. ఏం జరిగిందంటే?

కర్నాటకలోని మాండ్యా జిల్లాలో ఓ మహిళ, ఆమె భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.

By అంజి
Published on : 22 Aug 2024 8:10 AM IST

Karnataka, woman found hanging at home, husbands body found in lake, Crime

ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన భార్య.. సరస్సులో భర్త శవం.. ఏం జరిగిందంటే? 

కర్నాటకలోని మాండ్యా జిల్లాలో ఓ మహిళ, ఆమె భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం సాయంత్రం మహిళ తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించగా, బుధవారం ఉదయం ఆమె భర్త ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న సరస్సులో శవమై కనిపించాడు. మోహన్ (25), స్వాతి (22) రెండేళ్ల క్రితం వివాహమై ఏడాది వయసున్న బాలికకు తల్లిదండ్రులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి వివాహ బంధంతో తరచూ గొడవలు జరిగేవి.

"ప్రాథమిక అంచనా ఆధారంగా, ఇది ఆత్మహత్య కేసుగా కనిపిస్తోంది" అని మాండ్య పోలీసు సూపరింటెండెంట్ చెప్పారు. అయితే, స్వాతి కుటుంబ సభ్యులు మోహన్ కుటుంబంపై వరకట్న వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహన్ ఆమెను హత్య చేసి సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని స్వాతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహ సమయంలో దంపతులు తరచూ గొడవ పడుతుండేవారని పోలీసులు తెలిపారు. కూతురు చనిపోవడంతో ఆగ్రహం చెందిన స్వాతి తల్లిదండ్రులు, బంధువులు సమీపంలోని షెడ్డుకు నిప్పు పెట్టారు.

Next Story