Video: మహిళపై కర్రలు, పైపులతో గుంపు దాడి.. మసీదుకు పిలిపించి మరీ..

బెంగళూరులోని ఒక మసీదు వెలుపల 38 ఏళ్ల మహిళపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. కుటుంబ వివాదంపై ఆమెను అక్కడికి పిలిపించి ఈ దాడికి పాల్పడ్డారు.

By అంజి
Published on : 15 April 2025 6:01 AM

Karnataka, woman beaten, husband, mosque, Crime

మహిళపై కర్రలు, పైపులతో గుంపు దాడి.. మసీదుకు పిలిపించి మరీ..

బెంగళూరులోని ఒక మసీదు వెలుపల 38 ఏళ్ల మహిళపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. కుటుంబ వివాదంపై ఆమెను అక్కడికి పిలిపించి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనను వీడియోలో రికార్డ్ చేసి, తర్వాత ఆన్‌లైన్‌లో ప్రసారం చేశారు, దీనితో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. షబీనా బాను అనే మహిళ చెప్పిన దాని ప్రకారం.. ఆమె భర్త జమీల్ అహ్మద్ షమీర్ ఫిర్యాదు చేసిన తర్వాత ఆమెతో పాటు ఆమె బంధువు నస్రీన్ (32), ఫయాజ్ అనే వ్యక్తిని తవరేకెరెలోని జామా మసీదుకు పిలిపించారు.

మసీదు వెలుపల ఈ దాడి జరిగింది, అక్కడ కొంతమంది వ్యక్తులు షబీనాపై కర్రలు, పైపులు దాడి చేశారని, ఆమెను చంపడానికి రాళ్లతో కొట్టడానికి కూడా ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో.. పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మహ్మద్ నియాజ్, మహ్మద్ గౌస్పీర్, చాంద్ బాషా, ఇనాయత్ ఉల్లా, దస్తగిర్, రసూల్. వీరందరి పేర్లను షబీనా ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న షబీనా తన ఫిర్యాదులో, తన బంధువు నస్రీన్ ఏప్రిల్ 7న తనను సందర్శించిందని పేర్కొంది. ఆ రోజు, ఇద్దరు మహిళలు, షబీనా పిల్లలతో కలిసి బుక్కంబుడిలో ఓ పనిమీదకు బయటకు వెళ్లి.. ఆ సాయంత్రం తిరిగి వచ్చారు. వైద్య సలహా మేరకు, షబీనా తన మందులు తీసుకుని విశ్రాంతి తీసుకోవడానికి పడుకుంది. మొదట వెళ్లిపోతానని చెప్పిన నస్రీన్ చివరికి షబీనా ఇంట్లోనే ఉండిపోయింది. ఈ సమయంలో, ఫయాజ్ అనే వ్యక్తి కూడా ఆమెను కలిశాడు.

తరువాత, షబీనా భర్త జమీల్ అహ్మద్ షమీర్ ఇంటికి తిరిగి వచ్చి నస్రీన్, ఫయాజ్ ఇద్దరూ ఇంట్లో ఉన్నారని కనుగొన్నాడు. వారి రాకతో కలత చెందిన అతను తవరేకెరెలోని జామా మసీదు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తదనంతరం.. షబీనా, నస్రీన్, ఫయాజ్‌లను దాడి జరిగిందని చెప్పబడుతున్న మసీదుకు పిలిపించారు. ఏప్రిల్ 11న షబీనా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద అధికారికంగా ఫిర్యాదు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, నిందితులను పట్టుకున్నారు. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

Next Story